ఏపీలో కొత్తగా 1,886 కరోనా కేసులు.. మరో 12 మంది మృతి..!

Tuesday, November 10th, 2020, 10:13:48 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కొద్ది రోజుల రెంచి రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతుండగా నేదు ఆ సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటలలో 67,910 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,886 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,46,245 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 20,958 మంది చికిత్స పొందుతుండగా 8,18,473 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 2,151 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,814 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87,92,935 శాంపిల్స్ పరీక్షించారు.