కరోనా అప్డేట్: దేశంలో నేడు కొత్త కరోనా కేసులు ఎన్నంటే?

Sunday, December 27th, 2020, 04:25:08 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుందకున్నా కొత్త కరోనా వైరస్ మళ్ళీ టెన్షన్ పుట్టిస్తుంది. ఇప్పటికే దీనిపై అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు తగిన సూచనలు జారీ చేసింది. బ్రిటన్ వంటి ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,732 కరోనా కేసులు నమోదు కాగా, 279 మంది కరోనాతో మరణించారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,87,850కి చేరింది. ప్రస్తుతం అందులో 2,78,690 యాక్టివ్ కేసులు ఉండగా, 97,61,538 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,47,622 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంల్లో మొత్తం 21,430 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 95.75 శాతం ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.