తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?

Monday, August 24th, 2020, 09:44:44 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,842 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 6 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,825 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,091 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 82,411 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 22,919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 761 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 36,282 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 8,84,360 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 77.43 శాతం ఉండగా, మరణాల రేటు 0.74% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.