హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా మరో 178 కరోనా కేసులు..!

Saturday, February 27th, 2021, 09:48:03 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ నెమ్మదిగా పెరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 178 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా మరొకరు మృత్యువాత పడ్డారు. ఇక కరోనా నుంచి నేడు మరో 148 మంది కోలుకున్నారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,631 కి చేరింది. ఇక ఇప్పటివరకు 2,95,059 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 1,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,633 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 40,821 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 86,59,666 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 97.1 శాతం ఉండగా, మరణాల రేటు 0.54% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.