ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Thursday, March 11th, 2021, 08:48:19 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ నెమ్మదిగా పెరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 47,803 శాంపిల్స్‌ని పరీక్షించగా 174 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు మరొ ఇద్దరు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,178 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1158 మంది చికిత్స పొందుతుండగా 8,82,841 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 78 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,179 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,44,03,941 శాంపిల్స్ పరీక్షించారు.