కరోనా అప్డేట్: ఏపీలో నేడు భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Wednesday, November 11th, 2020, 08:46:45 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా నేడు ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 70,405 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,732 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 14 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 20,915 మంది చికిత్స పొందుతుండగా 8,20,234 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 1,761 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,828 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 88,63,340 శాంపిల్స్ పరీక్షించారు.