ఏపీలో కొత్తగా 1,728 కరోనా కేసులు.. మరో 9 మంది మృతి..!

Thursday, November 12th, 2020, 11:06:12 PM IST


ఏపీలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా రెండు రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 77,148 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,728 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,705 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 20,857 మంది చికిత్స పొందుతుండగా 8,22,011 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 1,728 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,837 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 89,40,488 శాంపిల్స్ పరీక్షించారు.