తెలంగాణలో కరోనా కల్లోలం.. నేడు కొత్తగా 1,724 పాజిటివ్ కేసులు..!

Thursday, August 20th, 2020, 10:00:14 AM IST

తెలంగాణలో కరోనా కల్లలోం సృష్టిస్తుంది. గత రెండు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు కనిపించినా మళ్ళీ నిన్నటి నుంచి కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,724 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 10 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,195 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,424 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 75,186 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 21,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 729కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 23,841 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 8,21,311 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 77.17 శాతంగా ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.