హెల్త్ బులెటిన్: తెలంగాణలో నేడు కాస్త తగ్గిన కరోనా కేసులు..!

Saturday, October 3rd, 2020, 10:01:12 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నేడు కాస్త తగ్గింది. గత కొద్ది రోజులుగా రోజుకు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తాజాగా గడిచిన 24 గంటలలో కేవలం 1,718 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో 8 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,002 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,97,327 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,67,846 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 28,328 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,153 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 49,084 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 31,53,626 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 85.05 శాతం ఉండగా, మరణాల రేటు 0.58% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.