ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Saturday, November 14th, 2020, 12:12:19 AM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా మూడు రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 80,737 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,593 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,51,298 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 20,262 మంది చికిత్స పొందుతుండగా 8,24,189 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 2,178 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,847 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 90,21,225 శాంపిల్స్ పరీక్షించారు.