హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా మరో 1,440 పాజిటివ్ కేసులు..!

Sunday, November 8th, 2020, 12:03:09 PM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి రెండు వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో కేవలం 1,440 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో 5 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,481 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,50,331 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,29,064 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 19,890 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,377 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 42,673 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 46,18,470 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 91.50 శాతం ఉండగా, మరణాల రేటు 0.55% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.