భారత్లో కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనాకు టీకా కూడా అందుబాటులోకి రావడంతో ముందు ముందు కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,256 కరోనా కేసులు నమోదు కాగా, 152 మంది కరోనాతో మరణించారు.
అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,39,684కి చేరింది. ప్రస్తుతం అందులో 1,85,662 యాక్టివ్ కేసులు ఉండగా, 1,03,00,838 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,53,184 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 17,130 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 96.82 శాతం ఉండగా, మరణాల రేటు 1.44 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.