భారత్‌లో కొత్తగా 13,083 కరోనా కేసులు.. మరో 137 మంది మృతి..!

Saturday, January 30th, 2021, 02:58:32 PM IST


భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనాకు టీకా కూడా అందుబాటులోకి రావడంతో కేసుల సంఖ్య మరింత తగ్గుతూ వస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,083 కరోనా కేసులు నమోదు కాగా, 137 మంది కరోనాతో మరణించారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,33,131కి చేరింది. ప్రస్తుతం అందులో 1,69,824 యాక్టివ్ కేసులు ఉండగా, 1,04,09,160 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,54,147 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 14,808 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 96.98 శాతం ఉండగా, మరణాల రేటు 1.44 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.