తెలంగాణలో నేడు భారీగా నమోదైన కరోనా కేసులు.. ఒక్క GHMC లోనే 108 కేసులు..!

Wednesday, June 3rd, 2020, 09:50:24 PM IST


తెలంగాణలో కరోనా పంజా విసురుతుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండగా నేడు కూడా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు 129 కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి ఏడుగురు మృతి చెందారు.

అయితే ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నేడు 108 కేసులు నమోదు కాగా రంగారెడ్డి 6, అసిఫాబాద్ 6, మేడ్చల్ 2, సిరిసిల్ల 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక నేడు వలస కూలీలలో కూడా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,020కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 1556 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 1365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 99కి చేరింది.