ఏపీలో కొత్తగా 1,236 కరోనా కేసులు.. మరో 9 మంది మృతి..!

Wednesday, November 18th, 2020, 09:14:52 PM IST


ఏపీలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 69,618 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,236 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,57,395 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 16,516 మంది చికిత్స పొందుతుండగా 8,33,980 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 1,696 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,899 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 93,33,703 శాంపిల్స్ పరీక్షించారు.