ఏపీలో కొత్తగా 1,221 కరోనా కేసులు.. మరో 10 మంది మృతి..!

Friday, November 20th, 2020, 10:35:09 PM IST


ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 66,002 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,221 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,59,932 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 15,382 మంది చికిత్స పొందుతుండగా 8,37,630 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 1,829 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,920 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 94,74,870 శాంపిల్స్ పరీక్షించారు.