భారత్‌లో కొత్తగా 12,143 కరోనా కేసులు.. 103 మంది మృతి..!

Saturday, February 13th, 2021, 04:10:08 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనాకు టీకా కూడా అందుబాటులోకి రావడంతో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,143 కరోనా కేసులు నమోదు కాగా, 103 మంది కరోనా బారిన పడి మరణించారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,92,746కి చేరింది. ప్రస్తుతం అందులో 1,36,571 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,00,625 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,55,550 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 11,395 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 97.3 శాతం ఉండగా, మరణాల రేటు 1.4 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.