ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు..!

Wednesday, March 31st, 2021, 06:48:17 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విజృంభిస్తుంది. కొద్ది రోజుల నుంచి మళ్ళీ రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యికి చేరువలోకి రాగా నేడు ఆ సంఖ్య వెయ్యి మార్క్‌ని దాటింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 30,964 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,184 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన నేడు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,01,989 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 7,338 మంది చికిత్స పొందుతుండగా 8,87,434 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 456 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,217కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,50,83,179 శాంపిల్స్ పరీక్షించారు.