భారత్‌లో కొత్తగా మరో 11,713 కరోనా కేసులు.. 95 మరణాలు..!

Saturday, February 6th, 2021, 05:30:56 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనాకు టీకా కూడా అందుబాటులోకి రావడంతో కేసుల సంఖ్య మరింత తగ్గుతూ వస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,713 కరోనా కేసులు నమోదు కాగా, 95 మంది కరోనా బారిన పడి మరణించారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,14,304కి చేరింది. ప్రస్తుతం అందులో 1,48,590 యాక్టివ్ కేసులు ఉండగా, 1,05,10,796 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,54,918 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 14,488 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 95 శాతం ఉండగా, మరణాల రేటు 1.4 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.