తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. నేడు కొత్త కేసులు ఎన్నంటే?

Sunday, August 16th, 2020, 10:31:08 AM IST

తెలంగాణలో గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా, నేడు మాత్రం కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,102 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 9 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,930 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361 చేరగా, కరోనా నుంచి కోలుకుని 68,126 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 693కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 12,120 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 7,44,555 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 74.56 శాతంగా ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.