ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు.. మరో 8 మంది మృతి..!

Tuesday, November 24th, 2020, 08:46:52 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 65,101 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 1,085 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,63,843 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 13,024 మంది చికిత్స పొందుతుండగా 8,43,863 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 1,447 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,956 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 97,27,321 శాంపిల్స్ పరీక్షించారు.