ఏపీలో ఆగని కరోనా కేసులు.. నేడు మరో 71 మంది మృతి..!

Saturday, September 5th, 2020, 09:20:56 PM IST


ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 69,623 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,825 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 71 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని నేడు 11,941 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,84,436 కి చేరగా అందులో 1,00,880 మంది చికిత్స పొందుతుండగా, 3,79,209 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4,347కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40,35,317 శాంపిల్స్ పరీక్షించారు.