ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా మరో 10,759 పాజిటివ్ కేసులు..!

Thursday, April 22nd, 2021, 10:00:46 PM IST

ఏపీలో కరోనా విజృంభిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 41,871 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,759 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 31 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,97,462కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 66,944 మంది చికిత్స పొందుతుండగా 9,22,977 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 3,992 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,541కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,58,35,169 శాంపిల్స్ పరీక్షించారు.