ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉదృత్తి.. నేడు కొత్త కేసులు ఎన్నంటే?

Saturday, August 29th, 2020, 09:47:57 PM IST


ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 62,024 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,548 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 82 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని నేడు 8,976 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,14,164 కి చేరగా అందులో 97,681 మంది చికిత్స పొందుతుండగా, 3,12,687 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,796కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36,03,345 శాంపిల్స్ పరీక్షించారు.