హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా 1,050 కరోనా కేసులు..!

Saturday, November 14th, 2020, 11:12:48 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి రెండు వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో కేవలం 1,050 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో నలుగురు చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,736 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,56,713 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,38,908 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 16,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,401 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 41,002 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 48,53,169 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 93.06 శాతం ఉండగా, మరణాల రేటు 0.54% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.