తిరుపతి ఉపఎన్నిక కి టీడీపీ అభ్యర్ధి ఖరారు!

Friday, March 19th, 2021, 04:26:01 PM IST

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కి సంబందించి ఆయా పార్టీలు తమ అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్ధి ఖరారు కాగా, తెలుగు దేశం పార్టీ తమ అభ్యర్ధి ను ప్రకటించింది. అయితే తెలుగు దేశం పార్టీ తరపున తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక బరి లో పనబాక లక్ష్మి పోటీ చేయనున్నారు. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

22 మంది ఎంపీ లను గెలిపిస్తే కేంద్రం ముందు తల వంచుకుని నిలబడటం తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించింది, సాధించింది ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్ధి గెలిస్తే ఇంకో మూగ గొంతు అవుతుంది అంటూ విమర్శలు చేశారు. అదే తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మి గారు గెలిస్తే తిరుపతి పార్లమెంటు తరపున ప్రశ్నించే గొంతుక అవుతారు అంటూ చెప్పుకొచ్చారు.