నేటి నుండి తిరుపతి, సాగర్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ

Tuesday, March 23rd, 2021, 09:32:59 AM IST

నేటి నుండి నాగార్జున సాగర్ మరియు తిరుపతి ఉప ఎన్నిక కి సంబందించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. నేటి నుండి ఈ నెల 30 వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 31 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, ఏప్రిల్ మూడవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ కి గడువు ఇచ్చింది. ఏప్రిల్ 17 వ తేదీన ఎన్నికలు నిర్వహించి, మే 2 వ తేదీన ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే అనివార్య కారణాల వలన ఈ రెండు చోట్ల ఉప ఎన్నిక తప్పనిసరి అయిన సంగతి అందరికి తెలిసిందే.