తిరుపతి లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ..!

Thursday, March 25th, 2021, 06:44:42 PM IST

తిరుపతి లోక్‌సభ స్థానానికి ఎట్టకేలకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పటికే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా వారితో నామినేషన్లు కూడా దాఖలు చేయించి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో జనసేన మద్దతుతో బరిలోకి దిగుతోన్న బీజేపీ తాజాగా వారి అభ్యర్థి పేరును ప్రకటించింది. చాల మంది పేర్లను పరిశీలించిన పార్టీ నాయకత్వం చివరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రత్నప్రభ పేరును ఫైనల్ చేసింది. ఈ మేరకు ఆమె పేరును కొద్ది సేపట్లో బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది.

ఇదిలా ఉంటే అధికార వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు గత ఏడాది కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. అయితే సిట్టింగ్ స్థానంలో ఎలాగైనా భారీ మెజారిటీతో గెలవాలని వైసీపీ పావులు కదుపుతుంది. ఈ నేపధ్యంలోనే డాక్టర్ గురుమూర్తిని ఆ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ప్రతిపక్ష టీడీపీ మాత్రం మాజీ మంత్రి పనబాక లక్ష్మీని బరిలోకి దింపి ఎలాగైన సత్తా చాటాలని భావిస్తుంది. అయితే ఏప్రిల్ 17న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.