ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు – తిరుపతి బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ

Monday, March 29th, 2021, 07:31:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అంటూ మరొకసారి క్లారిటీ ఇచ్చారు బీజేపీ తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పై పార్లమెంట్ లో ఇప్పటికే పలు మార్లు చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దీని పై బీజేపీ నేతలు ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా, తాజాగా రత్నప్రభ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పై స్పందించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని, అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి, ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు.అయితే మీడియా సమావేశం ద్వారా మాట్లాడిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో బీజేపీ తరపున పోటీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ తన జన్మభూమి అని, కర్ణాటక తన కర్మభూమి అని వ్యాఖ్యానించారు. అయితే తనకు అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యల పై పార్లమెంట్ లో గళమెత్తుతానని వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో బీజేపీ జన సేన పార్టీ లు ఉమ్మడి గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రం లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కాకుండా, తెరాస అభ్యర్థి కి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి అందరినీ కూడా షాక్ కి గురి చేశారు. అయితే ఏపీ లో కూడా అలాంటి అనుమానాలు ఉండటం తో వారి పొత్తు పట్ల ఆసక్తి నెలకొంది. అయితే జన సేన, బీజేపీ కి మధ్య ఎలాంటి విభేదాలు లేవని రత్నప్రభ అన్నారు. అయితే డబ్బులకు అమ్ముడు పోకుండా ప్రజలు ఓటేయాలని అన్నారు. ప్రజలకు, అభివృద్ధికి దగ్గర కావడమే అజెండా గా పని చేస్తా అని చెప్పుకొచ్చారు. అయితే తిరుపతి లో ప్రచారానికి జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తారు అంటూ ఒక స్పష్టత ఇచ్చారు.