తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకి షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Tuesday, March 16th, 2021, 06:46:33 PM IST

పలు చోట్ల అనివార్య కారణాల వలన శాసన సభ స్థానాలకు మరియు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే రెండు శాసన సభ మరియు 14 లోక్ సభ స్థానాలకి ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే అందులో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కి సంబందించి షెడ్యూల్ ఉన్నది. ఈ నెల 23 వ తేదీన నోటిఫికేశన్ జారీ చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. అదే విధంగా ఏప్రిల్ 17 న తిరుపతి మరియు నాగార్జున సాగర్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించనున్నారు.

అయితే ఈ నెల 30 వ తేదీ వరకు నామినేషన్ లు వేసేందుకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. 31 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, ఏప్రిల్ మూడవ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణ కి చివరి రోజు. అయితే మే నెల 2 వ తేదీన ఓట్ల లెక్కింపు తో పాటుగా ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం తో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలు లోకి రానుంది.