భారత్ లో 82 కి చేరిన కొత్త కరోనా కేసులు

Friday, January 8th, 2021, 02:12:29 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్న వేళ, కొత్త కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు భారత్ లో 82 కి చేరాయి. అయితే రోజురోజుకీ పెరుగుతున్న ఈ కేసుల కి సంబందించిన వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం నాడు వెల్లడించింది. అయితే జనవరి ఆరు వరకు ఈ కొత్త కరోనా కేసులు 73 గా ఉండగా, నేటికీ 82 కి చేరింది. అయితే ఈ కరోనా వైరస్ స్ట్రెయిన్ బాధితులను ఆయా రాష్ట్రాల్లో ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిపింది.

అయితే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారితో పాటు గా తోటి ప్రయాణికులను కూడా గుర్తించి, ఆయా కుటుంబ సభ్యులకి కూడా పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటోంది. అయితే కరోనా వైరస్ కొత్త కేసులను అరికట్టేందుకు మూడు వారాల పాటు యూ కే భారత్ విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ నిషేధం ఎత్తి వేయడం జరిగింది. జనవరి ఆరు న సేవలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. అయితే విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ కొత్త రకం కరోనా వైరస్ మహమ్మారి ఇతర దేశాలను సైతం వణికిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.