దేశంలో పెరుగుతున్న కొత్త కరోనా కేసులు

Tuesday, January 5th, 2021, 05:05:42 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఒక పక్కన తగ్గుముఖం పడుతుంటే, మరో పక్కన బ్రిటన్ నుండి వచ్చిన వారిలో కొత్త కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. సోమవారం నాటికి 38 కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు ఉండగా, మంగళవారం మరో 20 మందికి కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ కొత్త రకం కరోనా వైరస్ మహమ్మారి ఇతర దేశాలను భయాందోళన కి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ అమలు పై ఆలోచనలో ఉన్నాయి. బ్రిటన్ నేటి నుండి లాక్ డౌన్ అమలు చేస్తోంది.

అయితే భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టే సమయం లో, వాక్సిన్ కూడా అందుబాటులోకి రావడం శుభ పరిణామం అని చెప్పాలి. అయితే ఈ కరోనా వైరస్ వాక్సిన్ ల కి డీసీ జీ ఐ కూడా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు సైతం భారత్ కరోనా వైరస్ ను ఎదుర్కొన్న విధానం పట్ల పలువురు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ కొత్త రకం కరోనా వైరస్ ను అరికట్టడం కోసం నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.