ఏలూరు ఘటన…505 కి చేరిన బాధితుల సంఖ్య

Tuesday, December 8th, 2020, 08:23:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు లో ప్రజలు అస్వస్థకు గురి అవుతున్నారు. అయితే ఇందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే కొందరు చికిత్స పొందుతూ ఉండగా, మరి కొందరు ఆసుపత్రుల్లో వచ్చి చేరుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆసుపత్రి లో ఇలా చేరిన వారి సంఖ్య 505 కి చేరింది. అస్వస్థతకి గురి అయిన వారి లో ఇప్పటి వరకూ 330 మంది డిశ్చార్జ్ కాగా, ఇంకా 153 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు 19 మంది బాధితులను తరలించారు. అయితే ఇప్పటికే ఈ అంతుచిక్కని వ్యాధి తో ఒకరు మృతి చెందడం పట్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బాధితుల్లో 271 మంది పురుషులు, 235 మంది స్త్రీలు ఉన్నారు. అన్ని వయసు గల వారు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఇందుకు గల కారణాలు తెలుసుకొనేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం, ఆహారం అందించాలి అని అధికారులకు సూచించారు.