బిగ్ న్యూస్: ఏపీలో 5 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య!

Tuesday, September 15th, 2020, 08:40:16 PM IST

Corona_india
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా వైరస్ విలయ తాండవానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ అయిదు వేలకు పైగా బాధితులు ప్రాణాలను కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 8,846 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,81,030 కి చేరింది. అయితే ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

గడిచిన 24 గంటల్లో 69 మంది కరోనా వైరస్ కారణం గా ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,041 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 9,628 మంది కరోనా వైరస్ నుండి కోలుకొగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 4,83,636 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 92,353 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.