ఇప్పటి వరకూ 33 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న వైసీపీ

Sunday, March 14th, 2021, 03:02:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. అయితే ఏలూరు మినహా మిగతా అన్ని నగర పాలక సంస్థల్లో, పురపాలక సంఘాల్లో మరియు నగర పాలక పంచాయిత లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వైసీపీ ఈ ఎన్నికల్లో ముందంజ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పులివెందుల, పుంగనూరు, పిడుగు రాళ్ళు, మాచర్ల లో 128 డివిజన్ లలో వైసీపీ ఏకగ్రీవం అయింది. అయితే తాజాగా వస్తున్న ఫలితాల ప్రకారం వైసీపీ ఈ ఎన్నికల్లో దూసుకు పోతుంది. మొత్తం ఇప్పటి వరకూ కూడా 33 మునిసిపాలిటి లు వైసీపీ కైవసం చేసుకుంది. అయితే మూడు కార్పొరేషన్లు కూడా వైసీపీ గెలవడం గమనార్హం. అయితే అన్ని జిల్లాల్లో వైసీపీ హవా కొనసాగిస్తోంది. క్లీన్ స్వీప్ చేస్తూ మున్సిపల్ ఎన్నికల చరిత్రలోనే వైసీపీ సరికొత్త రికార్డ్ సృష్టిస్తోంది.