బిగ్ న్యూస్: తెలంగాణ లో 306 కి చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య!

Monday, July 6th, 2020, 10:50:07 PM IST


కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రం లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసులు రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,831 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదు అయిన ఈ పాజిటివ్ కేసులతో, రాష్ట్రం మొత్తం రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 25,733 కి చేరింది.

కరోనా వైరస్ మృతుల సంఖ్య సైతం తెలంగాణ రాష్ట్రం లో పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది ప్రాణాలను కోల్పోయారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్రం లో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 306 కి చేరింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,078 మంది కొలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 14,781 కి చేరింది.

అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య సైతం రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 6,383 పరీక్షలు చేయగా, మొత్తం ఇప్పటి వరకూ 1,22,218 నిర్దారణ పరీక్షలు చేయడం జరిగింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిది లో మాత్రం కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువ కేసులు అక్కడే నమోదు అవుతున్నాయి. నేడు 1,831 కరోనా వైరస్ పాజిటివ్ కేసులలో 1,419 గ్రేటర్ హైదరాబాద్ కి చెందినవి.