బిగ్ న్యూస్ : ఏపీ లో 3 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

Thursday, August 20th, 2020, 06:57:41 PM IST

Telangana_testing

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రాష్ట్రం లో రోజురోజుకీ పెరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య మూడు వేలకు పైగా చేరింది. గడిచిన 24 గంటల్లో 9,393 మంది కరోనా వైరస్ భారిన పడగా, ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,25,396 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారిన పడి 95 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మృతుల తో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 3,001 కి చేరింది. ఈ మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. తాజాగా 8,846 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 2,35,218 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 87,177 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎక్కువగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం కారణం చేత ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది.