దేశంలో మూడు కోట్ల చేరువకు కరోనా వాక్సిన్ పంపిణీ!

Sunday, March 14th, 2021, 04:34:33 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి పై జరుపుతున్న పోరు లో వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దశల వారీగా ఈ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్ళీ 20 వేలకు పైగా నమోదు అవుతూ ఉండటం కాస్త ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. అయితే దేశం లో కేసుల పెరుగుదల మళ్ళీ మొదలు అవ్వడం తో వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది. ఇప్పటి వరకు మూడు కోట్ల వరకు టీకా పంపిణీ జరిగినట్టు తెలుస్తోంది. వాక్సినేషన్ డ్రైవ్ రెండు నెలల నుండి కొనసాగుతూనే ఉంది.

అయితే గడిచిన 24 గంటల్లో మొత్తం 15,19,952 మందికి కరోనా వాక్సిన్ ఇవ్వగా, అందులో 12,32,131 మందికి మొదటి డోస్ ఇవ్వగా, మిగతా వారికి రెండవ డోస్ ఇచ్చారు. మొత్తం ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా ఇచ్చిన టీకాల సంఖ్య 2,97,38,409 కి చేరింది. అయితే భారత్ ఇతర దేశాలకు సైతం కరోనా వాక్సిన్ ను పంపిణీ చేస్తోంది.