భారత్ లో 109 కి చేరిన కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు

Thursday, January 14th, 2021, 04:15:54 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది అని అనుకొనే లోపే యూ కే వైరస్ భారత్ లోకి ప్రవేశించింది. ఊహించని రీతిలో ఈ మహమ్మారి భారిన పడి వందల మంది బ్రిటన్ లో ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఈ కొత్త రకం కరోనా, మునుపటి వైరస్ కంటే భిన్నంగా ఉండటం మాత్రమే కాకుండా, కోవిడ్ 19 కంటే కూడా ఎక్కువగా ప్రభావం చూపడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ భారత్ లో కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసుల సంఖ్య 109 కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

అయితే స్ట్రెయిన్ సోకిన వారిని ప్రత్యేక రూం లలో ఐ సోలేశన్ లో ఉంచినట్లు గా కేంద్రం ప్రకటించింది. అయితే పాజిటివ్ వచ్చిన వారి తో పాటుగా, వారి తో ప్రయాణించిన వారు, సన్నిహితుల వివరాలను సేకరించి పనిలో ఉన్నారు అధికారులు. అయితే ముందుగా యూ కే కి విమాన సేవలను నిలిపి వేసిన భారత్, తిరిగి జనవరి 8 నుండి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులకు అక్కడే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలెట్ చేసి, మిగతా వారిని 14 రోజుల పాటుగా క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారు.