భారత్ లో పెరుగుతున్న కరోనా స్ట్రెయిన్ కేసులు..!

Wednesday, January 13th, 2021, 04:04:08 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ను భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది. అయితే ఇప్పుడు యూ కే వైరస్ అయిన కరోనా స్ట్రెయిన్ మాత్రం భారత్ లోకి అడుగు పెట్టింది. నేటి వరకు 102 కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు భారత్ లో నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జనవరి 11 వరకు 96 గా ఉన్న ఈ స్ట్రెయిన్ కేసులు, మళ్ళీ పెరిగాయి. 102 కి చేరడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కొత్త రకం కరోనా పట్ల అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కో గది లో ఐసోలేట్ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అయితే పాజిటివ్ వచ్చిన వారికి స్నేహితులు, సన్నిహితుల వివరాలను సేకరించి పని లో ఉన్నారు అధికారులు. అయితే వారితో పాటుగా ప్రయాణం చేసిన వారిని,కలిసిన వారిని గుర్తిస్తున్నామని అన్నారు.అయితే పాజిటివ్ వచ్చిన వారి నమూనాల పై జన్యు పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని చాలా కీలకం గా పర్యవేక్షిస్తున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.