పవన్ పర్యటన లో అపశృతి…ముగ్గురికి తీవ్ర గాయాలు

Wednesday, December 2nd, 2020, 01:47:54 PM IST

జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరార్శించేందుకు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉయ్యూరు ప్రాంతంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అయితే పవన్ కళ్యాణ్ పరిశీలించిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. అయితే పవన్ వెంట వెళ్తున్న కార్యకర్తల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి బైక్ మరొకరికి ఢీ కొట్టడంతో వీరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకి తరలించినట్లు సమాచారం. అయితే ఈ పర్యటన లో పవన్ వద్ద రైతులు తమ బాధలను పంచుకున్నారు. ప్రభుత్వం తమ బాధను పట్టించుకోవడం లేదు అంటూ పవన్ తో చెప్పుకొచ్చారు. కాగా పవన్ కళ్యాణ్ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో హాట్ టాపిక్ గా మారింది. అటు సినిమా షూటింగ్ లో బిజీ గ ఉంటూనే పవన్ కళ్యాణ్ రైతుల సమస్యల పరిష్కారం కోసం పర్యటిస్తున్నారు.