బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయిన ఆ ముగ్గురు సినీ నటులు..!

Thursday, January 21st, 2021, 01:30:22 AM IST


ఏపీలో బీజేపీ బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. జనసేనతో కలిసి ముందుకు వెళ్తున్న బీజేపీ తిరుపతి ఉప ఎన్నిక ద్వారా సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలోనే పలు పార్టీల అసంతృప్తి నేతలు, సీనియర్ నాయకులకు గాలం వేస్తూనే సినీ గ్లామర్‌ను కూడా పెంచుకునే పనిలో ఉంది. సినీ నటులు వాణీ విశ్వనాథ్‌, ప్రియారామన్‌, అర్చనలు త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది.

అయితే కొద్ది రోజుల క్రితం సినీ నటీ అర్చన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కలిసి పార్టీలో చేరే అంశంపై చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల మరో నటి వాణివిశ్వనాథ్‌తో కూడా సోము వీర్రాజు చెన్నైలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాణి విశ్వనాథ్‌‌ను సోము వీర్రాజు బీజేపీలోకి ఆహ్వానించగా ఆమె పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇక మరో సినీ నటి ప్రియారామన్‌ను కూడా సోము వీర్రాజు బీజేపీలోకి ఆహ్వానించగా ఆమె కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యింది. అయితే త్వరలోనే వీరు ముగ్గురు బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం.