ఏపీ మంత్రి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్..!

Tuesday, June 2nd, 2020, 03:00:40 AM IST


ఏపీ మంత్రి శంకర్ నారాయణ కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో నివసిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ మేనత్త కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందారు. దీంతో కాస్త అనుమానం వచ్చిన అధికారులు మంత్రి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో మంత్రికి కరోనా నెగిటివ్ అని తేలగా, మంత్రి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ధర్మవరంలో మంత్రి నివసిస్తున్న సాయినగర్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు.