ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు చంపేస్తామంటూ బెదిరంపు కాల్స్.. పచ్చి బూతులట..!

Thursday, August 6th, 2020, 07:42:58 PM IST


మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతుంది. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన ప్రొఫెసర్ నాగేశ్వర్ జులై 25న తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని అన్నారు. ఆ రోజు ఉదయం ఒక ఫోన్ కాల్ వచ్చిందని ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి బూతులు మాట్లాడుతూ తనను చంపేస్తానని బెదిరించినట్లు తెలిపాడు.

అంతేకాదు ఆ రోజు తనకు అలాంటి కాల్స్ దాదాపు ఎనిమిది వరకు వచ్చాయని కానీ నేను లిఫ్ట్ చేయలేదని అన్నారు. బెదిరింపు కాల్స్ రావడంతో తాను హాక్ ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశానని, దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్టు ధృవీకరించారు. యూట్యూబ్‌లో తన పేరుతో ఛానల్ నిర్వహిస్తున్న ఆయ్న పలు టీవీ షోలలో కూడా అనేక అంశాలపై సుదీర్ఘమైన, అర్థవంతమైన విశ్లేషణలు ఇస్తూ ఉంటారు.