షాకింగ్ న్యూస్ : తెలంగాణలో తెరాస ఎమ్మెల్యే మృతి.. వివరాలు ఇవే.!

Thursday, August 6th, 2020, 08:04:16 AM IST

ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి వార్త విన్నా అది కాస్తా కరోనాకు సంబంధించిన వార్త గానే వినాల్సి వస్తుంది. పైగా ఈ మధ్యన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులకు కూడా ఊహించని రీతిలో కరోనా సోకుతుండటం మరింత కలవర పెడుతుంది.

దీనితో ఈ సమయంలో కరోనాతో మాత్రం చనిపోకూడదని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెరాస ఎమ్మెల్యే సోలిపేట రంగారెడ్డి చనిపోయారన్న వార్త అక్కడి రాజకీయ వర్గాలకు షాక్ ఇచ్చింది. అయితే ఆయన కరోనా వచ్చి చనిపోలేదని తెలుస్తుంది.

గత కొన్నాళ్ల కితం ఆయనకు కాలికి ఒక ఆపరేషన్ జరగగా దానికి ఇన్ఫెక్షన్ సోకిందట. కానీ అది ఎంతకు తగ్గకపోవడంతో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ ఆస్పత్రుకి తరలించారు. కానీ పరిస్థితి చేదాటి పోవడంతో ఆయన మృతి చెందారు. దీనితో ఆయన మరణం విషయంపై తెరాస శ్రేణులు విస్మయానికి గురయ్యారు.