వైరల్ : అక్కడ ప్రభుత్వం మందును హోమ్ డెలివరీ చేస్తారట..!

Saturday, August 8th, 2020, 11:38:50 AM IST

ఇప్పుడున్న పరిస్థితులను మరింత దారుణంగా మార్చేసింది మద్యం అమ్మకాలే అని చెప్పాలి. అసలు కరోనా ను కట్టడి చేసే సమయంలోనే ప్రజలను మందు కోసం బయటకు వదిలెయ్యడంతో ఊహించని విధంగా భారీ ఎత్తున కరోనా కేసులు పెరిగిపోయాయి. అయితే ఇదే పంథా ప్రతీ రాష్ట్రంలో కొనసాగుతుంది. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అద్భుతమైన మూవ్ తీసుకుంది.

ఫుడ్ డెలివరీ లానే వారు మద్యాన్ని ఇంటికి డెలివరీ చెయ్యనున్నారట. ఈ నిర్ణయానికి కాబినెట్ కూడా ఆమోదం తెలిపిందట. ఇంతకీ ఈ వినూత్న నిర్ణయం ఎక్కడ తీసుకున్నారంటే మేఘాలయ రాష్ట్రంలో తీసుకున్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలుతో మద్యాన్ని సరఫరా చెయ్యనున్నారట.

ఖచ్చితంగా 20 ఏళ్ళు దాటిన వారికే ఒక్కో ఆర్డర్ లో నాలుగు లీటర్ల బీర్ మూడు లీటర్ల మద్యంను ఇవ్వనున్నారట. ఒకవేళ వయసు విషయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచినట్టైతే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వారు హెచ్చరించారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చి ఉంటే ఇక్కడ ఎన్నో చావులు తప్పి ఉండేవి.