కెసిఆర్ లో ఈ మార్పుకు కారణం ఇదేనా?

Monday, June 29th, 2020, 12:00:15 AM IST

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ లో ఇప్పుడు గట్టి మార్పే వచ్చిందని చెప్పాలి. కరోనా వైరస్ ప్రమాదకర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పాలి. మొదటి నుంచీ అక్కడ కేసులు ఎక్కువ ఉన్నప్పటికీ టెస్టులు నిర్వహించడంలో ఏమాత్రం స్పీడ్ పెంచలేదు.

కానీ అప్పటికి మాటలతో మాత్రం ఎనలేని భరోసాను ఇచ్చేసారు. దేనితో కెసిఆర్ అప్పటికి హీరోలా కనిపించినా జీరో అనిపించుకోడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు. ముఖ్యంగా తెలంగాణాలో వస్తున్న భారీ కేసుల్లో ఎక్కువ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 90 శాతానికి పైగా కేసులు రావడం కలకలం రేపింది.

దీనితో మొన్ననే కెసిఆర్ పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో నెగిటివిటీ మొదలయ్యింది. దీనితో కెసిఆర్ హుటాహుటిన అధికారులతో సమావేశం నిర్వహించి జిహెచ్ఎంసి పరిధిలో రాబోయే రోజుల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ అకస్మాత్తు మార్పుకు కారణం అయితే సోషల్ మీడియాలో కెసిఆర్ సర్కార్ పై వచ్చిన నెగిటివిటీయే ప్రధాన కారణం అని చెప్పాలి.