ఈ కష్టకాలంలో జగన్ కు ఇదే రిలీఫ్ ఇచ్చిన అంశం.!

Saturday, August 1st, 2020, 07:05:22 AM IST

కొత్త ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాది అయ్యిపోయింది. ఇంకా అభివృద్ధి పథంలో ఏమో కానీ ఈలోపునే చాలా అనర్ధాలు సహా భారీ మార్పులు జరిగిపోయాయి. అయితే ఇప్పుడు మాత్రం జగన్ టైం అసలు ఏం బాగాలేదని చెప్పాలి.

కరోనా దెబ్బతో ఊహించని విధంగా జగన్ గ్రాఫ్ దెబ్బతింది. టెస్టులు చేస్తున్నారన్న పేరుకు తప్ప రికవర్ రేటులో మాత్రం వెనకబడటం మైనస్ అయ్యింది. అలాగే అతను తీసుకుంటున్న నిర్ణయాలుకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఇటీవలే విద్యా విధానంలో కానీ నిమ్మగడ్డ విషయంలో కానీ దెబ్బ మీద దెబ్బ పడింది.

కానీ వీటన్నింటినీ మించి మూడు రాజధానులకు గవర్నర్ నుంచి ఆమోదం రావడం జగన్ అండ్ కో కు ఒక సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చింది అని చెప్పాలి. దీనితో ఈ కష్ట కాలంలో ఈ ఒక్క అంశం వల్ల కాస్త ఊరట ఇచ్చే అంశం అని చెప్పొచ్చు.