నేడు ఏపీ లో మూడో దశ పంచాయతీ ఎన్నికలు

Wednesday, February 17th, 2021, 07:19:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ రెండు దశల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే నేడు మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్ట్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల వివరాలు లెక్కింపు అనంతరం ప్రకటించనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం తో అందుకు అనుగుణంగా పోలింగ్ జరగనుంది. పాజిటివ్ ఉన్న పేషంట్ లకు ప్రత్యేక సమయం లో పోలింగ్ జరగనుంది.

ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ఎక్కువ శాతం స్థానాల్లో విజయం సాధిస్తుండగా, తరువాతి స్థానం లో తెలుగు దేశం పార్టీ కొనసాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఎన్నికలు ప్రతి ఒక్క పార్టీ కి కూడా కీలకం కానున్నాయి.