పవన్ సినిమాలో వీరిద్దరూ లక్కీ ఛాన్స్ కొట్టేశారా?

Friday, October 30th, 2020, 04:11:48 PM IST

పవన్ కళ్యాణ్ సినిమా లో నటించడం కోసం ఎంతోమంది హీరో హీరోయిన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. పవన్ కి యంగ్ హీరో, హీరోయిన్స్ లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే అందులో నితిన్ ఒకరు. పవన్ కళ్యాణ్ పై అమితమైన అభిమానం చూపించే వారిలో నితిన్ ముందు వరుసలో ఉంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఒక కొత్త సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ హై ఓల్టేజ్ రోల్ లో నటించడానికి సిద్దం అవుతున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొత్త వీడియో ను పోస్ట్ చేయడం జరిగింది. అయితే అయ్యప్పన్ కోషియన్ కి రీమేక్ అంటూ టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తెలుగు లో బిల్లా రంగా అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో నితిన్ ఒక కీలక పాత్ర లో చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే ఇదే చిత్రం లో నటి సాయి పల్లవి హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. చిత్ర యూనిట్ ఇటీవల సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఇదే జరిగితే వీరిద్దరూ కూడా లక్కీ ఛాన్స్ కొట్టి నట్లే అని చెప్పాలి.